సరిగ్గా రెండంటే రెండు నెలల్లో విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రకటించారు. ‘ఇన్ఫినిటీ వైజాగ్-2023’ సదస్సు ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు.రాబోయే ఆరు నెలల్లో అన్ని గ్రామాలకు ఫైబర్‌నెట్ సౌకర్యం కల్పిస్తామని, ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి కనెక్టివిటీ వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 15 వేల డిజిటల్ లైబ్రరీలు వస్తాయన్నారు. విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ నిర్మాణానికి 15 రోజుల్లో శంకుస్థాపన జరుగుతుందని, దాని వల్ల రూ.14 వేల కోట్ల పెట్టుబడులతో పాటు 20వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇన్ఫోసిస్ విశాఖలో కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిందని, విప్రో వేయి సీట్లతో మరో సెంటర్ పెడుతుందని, వారితో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.