మనుషుల పేరిటే భూములు రిజిష్ట్రర్ చేయడం మనం వినివుంటాం. కానీ . 32 ఎకరాల భూమిని కోతుల పేరిట రిజిస్టర్ చేశారు అంటే మీరు నమ్ముతారు. కచ్చితంగా ఇది నమ్మాల్సిందే. మామూలుగా కోతులు ఇళ్లల్లోకి వస్తే మనం వాటిని తరిమేస్తూ ఉంటాం. మన చెట్ల మీదకి గానీ.. ఇళ్లలోకి వస్తే ఏం అల్లరి చేస్తాయో అనే భయంతో వాటిని ఎలాగొలా పంపేసేందుకు ప్రయత్నిస్తాం. కోతులు ఇళ్లల్లోకి వచ్చి అందిన ఆహారాన్ని లాక్కొని పారిపోతాయి. ఇల్లంతా చిందరవందర చేస్తాయి. ఒక్కోసారి ఇంట్లోని పిల్లలపై దాడి చేస్తాయి. అందుకనే మనం కాస్త భయపడతాం. కానీ ఇక్కడ మాత్రం కోతులకి గొప్ప గౌరవం దక్కింది.
ఈ గౌరవం ఏంటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వార్త విన్న వాళ్లందరూ షాక్ అవుతున్నారు. ఏకంగా 32 ఎకరాలను కోతుల పేరిట రాయడం విచిత్రంగా ఉంది కదా..? మహారాష్ట్రలో ఇలా జరిగింది. 32 ఎకరాల భూమిని కోతుల పేరిట రిజిస్టర్ చేశారు. చాలా వింతగా ఉంది కదా. అందుకే ఈ వార్త వైరల్ అయ్యింది.
సాధారణంగా భూ తగాదాలు వస్తూ ఉంటాయి ఆ సందర్భంలో మహారాష్ట్ర.. ఉస్మానాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో 32 ఎకరాల భూమిని కోతుల పేరిట రిజిస్టర్ చేశారు. ఇంత గౌరవం దక్కింది అక్కడ కోతులకు. ఉస్మానాబాద్ జిల్లాలోని ఉప్పల అనే ఒక గ్రామంలో కోతులు ఇంటికి వస్తే ఆహారాన్ని పెడతారు. వివాహాల వంటివి జరిగినప్పుడు వాటిని గౌరవిస్తారు. వాటికి ముందుగా బహుమతి ఇస్తారు. ఆ తర్వాతే పెళ్లి ఏర్పాట్లు మొదలవుతాయి. ఉప్పల గ్రామ పంచాయతీ 32 ఎకరాల భూమిని వాటి పేరిట రాసింది. డాక్యుమెంట్లో క్లియర్గా ఈ భూమి కోతులకి అని రాశారు. ఆ గ్రామంలో సుమారు 100 కోతులు ఉన్నాయి.
నిజంగా ఆ భూమిని కోతుల పేరున రాసేశారు. మన దేశంలో చాలా మందికి చిన్న ఇల్లు కట్టుకోవడానికే స్థలం లేదు. అలాంటిది ఆ కోతులు.. 32 ఎకరాల భూమికి యజమానులుగా మారడం ఆసక్తికరమే. ఆ స్థలంలో చాలా చెట్లు ఉన్నాయి. వాటిపై గెంతుతూ ఆ వానరాలు హాయిగా జీవిస్తున్నాయి.
మనుషులకు ఇలా భూమి వస్తే.. దాని చుట్టూ ప్రహరీ వేసుకొని.. ఎన్నో రక్షణ చర్యలు తీసుకుంటారు. ఇలాంటివేవీ తెలియని ఆ మూగజీవాలు.. చెట్లపై దొరికే కాయలు, గింజలు తింటూ.. సరదాగా ఆడుకుంటూ జీవిస్తున్నాయి. వాటిని చూసిన వారంతా.. అదృష్టం అంటే వీటిదే అంటున్నారు. అందుకే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్థానికుల నిర్ణయాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. నిస్వార్థమైన ఇలాంటి పనులు.. మరింత మంది మంచి పనులు చేసేందుకు ప్రేరణగా నిలుస్తాయని అంటున్నారు.