పేదవాళ్ల నుంచి ధనికుల వరకూ ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్‌కి బాగా అలవాటైపోయారు. ఇది మనుషులకే కాదు జంతువులకు కూడా అలవాటైపోయిందని ఓ వీడియో చెబుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కేరళ ఎలిఫేంట్ అనే పేజీలో ఈ వీడియోని షేర్ చేశారు. దీన్ని గమనిస్తే.. ఓ గుడిలో మావటి కూర్చొని ఉన్నాడు. ఆయన తన దారిన తాను మొబైల్ చూసుకుంటున్నాడు. ఆయనంటే ఎంతో ప్రేమ కలిగివున్న ఓ గజరాజు పక్కనే నిల్చున్నాడు. తన యజమాని ఏం చేస్తున్నాడా అని గమనించిన ఏనుగుకి అతని చేతిలో మొబైల్‌పై దృష్టి పడింది. అందులో దృశ్యాలు మారుతూ ఉంటే... ఆశ్చర్యపోయిన ఏనుగు.. దాన్ని చూసేందుకు కిందకు వంగింది. అక్కడ వీలుగా లేకపోయినా.. ఎడ్జస్ట్ చేసుకుంటూ.. తను కూడా మొబైల్‌ని చూడటం మొదలుపెట్టింది. ఇది గమనించిన కొందరు.. తమ మొబైల్‌తో వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. చాలా మంది దీన్ని చూసి.. అందమైన, మనసును ఆకట్టుకునే వీడియో అని చెబుతున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇప్పటివరకూ 2.93 లక్షల వ్యూస్ వచ్చాయి. 39వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఆ మావటి.. తమిళనాడు కుంభకోణంలోని కుంభేశ్వరాలయం దగ్గర కూర్చున్నారని తెలిసింది. దీనిపై నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. ఒక సోషల్ మీడియా యూజర్ "ఏం చూస్తున్నావో చెప్పు" అని ఏనుగును ప్రశ్నించినట్లు కామెంట్ చేశారు. "హార్ట్ ఇమోజీలతో మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "ఫోన్‌లో ఉండేది చదవడానికి ఏనుగు ప్రయత్నిస్తోంది" అని మరో యూజర్ కామెంట్ రాశారు. "ఏనుగులు పెద్ద పిల్లలు" అని ఇంకో యూజర్ కామెంట్ ఇచ్చారు. ఇలా సోషల్ మీడియాలో వరుసగా కామెంట్స్ ఇస్తూనే ఉన్నారు నెటిజన్లు.