కొన్ని కొన్ని ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక కథలు ఉంటాయి. కానీ ఓ జల పతానికి కూడా ఓ ప్రత్యేక కథ ఉంది. ఇదిలావుంటే పర్యాటకులు వివిధ రకాల ప్రాంతాల్ని సందర్శించడానికి వెళ్తుంటారు. అలానే ప్రతి సంవత్సరం ఎక్కువ మంది టూరిస్టులు మేఘాలయకి వెళ్తారు. వారిలో 90 శాతం మంది మేఘాలయలోని నోహ్కాలికై వాటర్ ఫాల్స్‌ని చూడడానికి వెళ్తూ ఉంటారు. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇది ఇండియాలో అతి ఎత్తైన ప్లంజ్ జలపాతంగా గుర్తింపు పొందింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య దీని పరిసర ప్రాంతాలు చూడటానికి బాగుంటాయి. ఆ సమయంలో ఇక్కడికి వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు.
చక్కటి ప్రకృతి మధ్య కాసేపు సమయాన్ని గడిపితే ఎంతో అద్భుతంగా ఉంటుంది అందులోనూ పచ్చని ప్రకృతి నడుమ మనం ఉంటే సమయం తెలియదు. స్టేట్ టూరిజంని పెంపొందించడానికి ఈ వాటర్ ఫాల్ సరిపోతుంది అన్నట్లుగా చాలా అందంగా ఉంటుంది ఈ ఫాల్స్. అందుకే ఎక్కువ మంది ఈ ప్రదేశాన్ని చూడడానికి వెళ్తుంటారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు ఎక్కువ మంది ఉదయం, మధ్యాహ్నం పూట్ల వెళ్తూ ఉంటారు ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ జలపాతం వద్ద ఓ ఘోర సంఘటన జరిగింది. మరి ఆ భయంకర కథను తెలుసుకుందాం.
ఖాసీ భాషలో 'కా' అనేది స్త్రీ లింగాన్ని సూచిస్తుంది. లికై అనేది ఒక స్త్రీ పేరు. అయితే స్థానిక పురాణాల ప్రకారం నోహ్కాలికై జలపాతానికి పైన ఓ గ్రామం వుంది. అదే రంగ్జిర్తెహ్ గ్రామం. అక్కడ లికై అనే మహిళ ఉండేది. ఆమె భర్త చనిపోయాడు. ఆమె తన బిడ్డతో పాటు ఉండేది. తన బిడ్డను చూసుకోవడానికి ఆమెకు కష్టంగా ఉండేది. దాంతో ఆమె మరో వివాహం చేసుకుంది. ఆమె రెండో భర్త దుర్మార్గుడు. అతనికి మొదటి భర్త కూతురు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఓ రోజు భార్యకి వంట చేసి పెట్టాడు. ఆ సమయంలో బిడ్డ కనిపించ లేదు.
ఆ బిడ్డని చంపేసి భార్యకు వండి పెట్టాడు ఆ రాక్షసుడు. మాంసం కూర తినేసి తమలపాకులు, వక్క వేసుకునేటప్పుడు ఆమెకి ఇదంతా తెలిసిందట. లికై.. తమలపాకులు వేసుకునే చోటికి వెళ్ళాక అక్కడ ఒక చిన్న వేలు వుంది. ఇది చూసి.. ఆశ్చర్యపోయిన ఆమెకు అసలు విషయం అర్థమైంది. ఆ తర్వాత ఆమె.. ఓ చేతిలో గొడ్డలితో.. ఊర్లో పరుగులు పెడుతూ.. చివరకు జలపాతంలో పడిపోయినట్లు చెబుతారు. దాంతో ఆమె పేరు మీదనే నోహ్కాలికై అనే పేరు వచ్చింది. ఇదంతా నిజంగా జరిగింది అనేందుకు ఆధారాలు లేవు. స్థానికులు మాత్రం ఇదే కథను చిన్న చిన్న మార్పులతో ఇలాగే చెబుతుంటారు. చాలా మంది ఈ కథను తెలుసుకొని.. స్థానికులు చెప్పే విషయాలు రికార్డ్ చేసుకుంటారు. కానీ ఎవరూ దీన్ని నిరూపించేందుకు వీలుగా ఆధారాలు లేవు.