పరవాడ టాగూర్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురై విశాఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొక కార్మికుడు గురువారం ఉదయం మృతి చెందాడు. మృతి చెందిన కార్మికుడు పిఠాపురానికి చెందిన సిహెచ్ వీరశేఖర్ గా గుర్తించారు.
మరో కార్మికుడు టి. చిన్నకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఠాగూర్ ఫార్మా యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సిఐటియు నేత గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.