ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి సరఫరా చేసే ఫ్యామిలీలకు ప్రభుత్వం నుంచి అందించే ఏ సంక్షేమ పథకాలు రాకుండా చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ‘ఈగల్ ’ గా మార్చుతూ కేబినెట్ సబ్ కమిటీలో చర్చించినట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
సచివాలయంలో జరిగిన భేటీలో మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై చర్చించి.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.