తెలుగుదేశం పార్టీ యువత, టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ విభాగాల సభ్యులతో కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు శనివారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సుబ్బానాయుడు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి యువత ఆవశ్యకత చాలా అవసరమని, ప్రస్తుత రాజకీయాల్లో నెటిజన్ల పాత్ర తీవ్రస్థాయిలో ఉందని, సామాజిక మాధ్యమాల్లో పార్టీ శ్రేణులు మమేకమై తెలుగుదేశం పార్టీ ప్రచారానికి దోహదపడాలని కోరారు.