పెద్దకడబూరు: మండలంలోని జాలవాడి గ్రామంలో కురువ బజారి గుడిసె శనివారం అగ్ని ప్రమాదంలో దగ్ధమయింది. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ వీరేంద్ర గౌడ్, ఆర్ఐ మహేష్, వీఆర్వో శ్రీనివాసులను విచారణకు పంపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఆర్ఐ మహేష్, వీఆర్వో శ్రీనివాసులు బాదితుల నుండి వివరాలు సేకరించారు. అగ్ని ప్రమాదంలో 40 వేలు నగదు, మూడు తులాల బంగారం, 50 తులాల వెండి, పది క్వింటాళ్ల పత్తి, రెండు క్వింటాళ్ల బియ్యం, ఇతర వస్తువులు మొత్తం రూ. 3. 50 లక్షలు ఆస్తినష్టం సంభవించినట్లు ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు ఆర్ఐ మహేష్ విలేకరులకు తెలిపారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపి, బాదితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆర్ఐ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మల్లమ్మ, ఎంపీటీసీ వెంకటేష్, ఉప సర్పంచ్ ఉసేని, వైసీపీ నాయకులు ఆంజనేయులు, ఎండీయు ఆపరేటర్ కోరి నరశింహులు తదితరులు పాల్గొన్నారు.