వచ్చే ఎన్నికల్లో విజయం కోసం మతం మారి ముస్లింలుగా మారిన వారిపై బీజేపీ పస్మాందా పేరు అస్త్రం సంథించనున్నది. ఇదిలావుంటే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ అయ్యింది. హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ పావులు కదుపుతోంది. మరో 13 నెలల్లో జరగబోయే ఎన్నికలకు సంసిద్ధం కావాలని ప్రధాని మోదీ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన బీజేపీ కార్యకవర్గ సమావేశంలో ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ హాట్రిక్ సాధించటం ఖాయమని నేతలకు భరోసానిచ్చారు. అదే సమయంలో అనుసరించాలన్సిన వ్యూహాలను నేతలకు వివరించారు.
సమాజంలోని అన్ని వర్గాలవారికీ దగ్గరవ్వాలని మరీ ముఖ్యమంగా ముస్లిం మైనార్టీలకు, అందులోనూ 'పస్మాందా' ముస్లింలపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ఈజీగా విజయం సాధించవచ్చునని తెలిపారు. అయితే మోదీ వ్యూహం ఏంటి ? ఇంతకీ ఈ పస్మాందా ముస్లింలు ఎవరు ? బీజేపీ వీరినే ఎందుకు టార్గెట్ చేసింది ? మెుదట్నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ముస్లింలు వారికి ఎలా మద్దతిస్తారనేది ఆసక్తిరంగా మారింది.
ఇండియాలో నివసించే ముస్లింలను ప్రధానంగా మూడు వర్గాలుగా విభజిసతారు అందులో ఒకటి అష్రఫ్‌లు. పర్షియా, అరేబియా, తుర్కియే, అఫ్గానిస్థాన్‌ల నుంచి వచ్చిన సయ్యద్, షేక్, మొగల్, పఠాన్ ముస్లింలతోపాటు.. హిందూమంతలో నుంచి మతం మారిన రాజ్‌పుత్ ముస్లింలు, గౌర్ ముస్లింలు, త్యాగి ముస్లింలు అందరినీ అష్రఫ్‌లుగా పరిగణిస్తారు. వీరు సంపన్న ముస్లింలు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. అలాగే ఉన్నత విద్యావంతులు.
రెండో రకానికి చెందిన వారు అజ్లఫ్‌లు. వీరు సంప్రదాయ వృత్తుల్లో స్థిరపడ్డవారు.అంటే చేనేత, దర్జీ, కూరగాయల అమ్మకం తదితర వృత్తులపై వీరు ఆధారపడి జీవిస్తున్నారు. వీరు హిందువుల్లో ఓబీసీల మాదిరిగా ముస్లింలలో వెనుకబడిన వారు. మూడోవర్గానికి చెందిన వారే అర్జల్ ముస్లింలు. వీరు ముస్లింలలో దళితులుగా పిలువబడుతున్నారు. నాయూలు, ఫకీర్లు, ధోబీలు, హలాల్ చేసేవారు, పారిశుద్ధ్య కార్మికులు ఈ వర్గం కిందికి వస్తారు. వీరిని 1901లో తొలిసారిగా గుర్తించారు.
'పస్మాందా' అంటే విడిచిపెట్టినవారు అనే అర్థం వస్తుంది. ఈ పదం పర్షియన్ పదం నుంచి వచ్చింది. ముస్లింలలో రాజకీయంగా సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారని పస్మాందా ముస్లింలు అని పిలుపుస్తారు. కొన్ని గణంకాల ప్రకారం, భారతదేశంలోని 17 కోట్ల ముస్లిం జనాభాలో 'పస్మాందా' ముస్లింలు దాదాపు 80-85 శాతం ఉంటారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, బెంగాల్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ముస్లింలకు లభించే ప్రభుత్వ, ఇతరత్రా ప్రయోజనాలన్నింటినీ తమలోని సంపన్నులే పొందుతున్నారనేది పస్మాందాల ఆరోపణ. తమ సంఖ్యను చూపి సంపన్న ముస్లింలే లబ్ధి పొందుతున్నారన్నది మెుదట్నుంచి వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే పస్మాందాలు టార్గెట్‌గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. వీరి ఓట్లను పొందటం ద్వారా ముస్లిం వ్యతిరేకత భావనను తొలగించుకోవాలని భావిస్తోంది. 2014 నుంచే ముస్లింలలో వెనుకబడిన పస్మాందాలను ఆకట్టుకోడానికి బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో వీరిని ఆకట్టుకుని అనుహ్య విజయం సాధించింది. యూపీలో మైనార్టీ వ్యవహారాల శాఖను పస్మాందా వర్గానికి చెందిన దానిష్ ఆజాద్ అన్సారీకి అప్పగించి వారి శ్రేయస్సుకు పాటుపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పస్మాందాల మద్దతు తమ విజయానికి కలిసొచ్చిందనేది బీజేపీ భావన. ఇదే వ్యూహాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అమలు చేయాలని మోదీ ప్లాన్.అందుకే అన్ని రాష్ట్రాల్లోని పస్మాందా ముస్లింపై బీజేపీ కన్నేసింది. వారికి చేరువై.. వారి ఓట్లను రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది. తద్వారా హ్యాట్రిక్ విజయం సాధించొచ్చునని కమలనాథులు భావిస్తున్నారు.