ఓ వృద్ధుడ్ని కారు 8 కి.మీ ఈడ్చుకెళ్లిన ఘటన బీహార్ చంపారన్ జిల్లాలో జరిగింది. బాంగ్రాకి చెందిన శంకర్ చౌదర్ (70) జాతీయ రహదారి దాటుతుండగా ఓ కారు వేగంగా ఢీకొట్టింది. వృద్ధుడు కారు బానెట్ పై పడిపోగా.. డ్రైవర్ నిర్లక్ష్యంగా 8 కి.మీ పోనిచ్చాడు. స్థానికులు కేకలు వేయగా సడన్ బ్రేక్ వేయడంతో వృద్ధుడు కింద పడిపోగా పైనుంచి పోనివ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.