చత్తీస్‌గఢ్‌లో శనివారం రాత్రి విషాద ఘటన జరిగింది. బిలాస్‌పూర్ జిల్లాలోని రతన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి రతన్‌పూర్-పాండ్రో రోడ్డులో ఓ కారు ప్రమాదానికి గురైంది. చెట్టుకు గుద్దుకున్న వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో షానవాజ్ ఖాన్ అనే జర్నలిస్టు, అభిషేక్ కుర్రే, మరో బాలిక సజీవ దహనం అయ్యారు. బిలాస్‌పూర్ నుంచి రతన్‌పూర్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa