అర్హులకు నవరత్నాలను అందిస్తున్న ప్రభుత్వం తమదని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ మూల సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం జమ్మలమడుగు మండల పరిధిలోని ఎస్ ఉప్పలపాడు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లారు. స్థానికులకు త్రాగునీటి సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్వరగా సమస్య పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామంలోని సచివాలయాల ఉద్యోగులు వాలంటీర్ల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని తెలియజేశారు.