తన తల్లి కోసం మరొకర్ని చంపిన ఘటన మేడిపల్లిలో జరిగింది. సదరు యువకుడి తల్లి 14 ఏళ్లుగా కనిపించకుండా పోయింది. అయితే ఫేస్ బుక్ ద్వారా తల్లి మేడిపల్లిలో వెంకటమూర్తి అనే వ్యక్తితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తుందని కుమారుడు గుర్తించాడు. తల్లిని ఇంటికి తీసుకెళ్లుందుకు ప్రయత్నించగా, సహజీవనం చేస్తున్న వ్యక్తితోనే ఉంటానని తేల్చి చెప్పింది. దీంతో ఆమె కుమారుడు వెంకటమూర్తిని హత్య చేశాడు.