కొబ్బరి నూనెను చాలా రకాలుగా వాడుతుంటారు. అయితే కొబ్బరినూనెను ఉపయోగించడం వలన బరువు తగ్గడానికి అవుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. టేబుల్ స్పూన్ కొబ్బరినూనెకు సుమారు 120 కేలరీలు చేరతాయి. అయితే బరువు తగ్గాలని అనుకునే వారు కొబ్బరి నూనెని మాత్రమే డైట్లో యాడ్ చేసుకుంటే సరిపోదు. బరువు తగ్గేందుకు మిగిలిన పద్ధతులని కూడా అనుసరించాలి. డైట్, జీవన విధానంపైన కూడా దృష్టి పెట్టాలి.