బీమా లేని వాహనాలు ఢీకొన్న ప్రమాదాల్లో బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయమై చట్టబద్ధమైన నిబంధనలను ఆరు నెలల్లోపు అమలు చేయాలని ఓ కేసు విచారణ సందర్భంగా కేంద్రప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హిట్ అండ్ రన్, బీమా లేని వాహనాల వల్ల జరిగిన ప్రమాదాల్లో బాధితులకు పరిహారం చెల్లించడానికి ఇప్పటికే మోటారు వాహన చట్టానికి సవరణలు చేశామని, వాటి అమలుకు ఆర్నెళ్ల సమయం కావాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.