వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని టీడీపీ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని బద్వీటిచెర్లోపల్లిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ.... వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందాలంటే ప్రజల్లో తిరుగుబాటు రావాలన్నారు. నవరత్నాల ముసుగులో రాష్ట్రంలో ప్రజా వంచనకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రాని కి ఇదేం ఖర్మ పేరుతో టీడీపీ చేపట్టిన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి, నాయకులు గొట్టం శ్రీనివాసరెడ్డి, ఆకుమల్ల యోగిరెడ్డి, లింగాల అబ్రహాం, దండా వెంకటేశ్వరరెడ్డి, ఆకుమల్ల సుబ్బారెడ్డి, యేరువ పెరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.