కడప జిల్లా, తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రా రంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సూచికగా స్వామి వారి సన్నిధిలో ధ్వజారోహణం శాసో్త్రక్తంగా నిర్వహించి..ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. ఆదివారం తెల్లవారుజామున స్వామి వారిని సుప్ర భాత సేవతో మేల్కొలిపి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనం తరం 7 గంటల నుంచి 8 గంటల మధ్య మకర లగ్నంలో మంగళవాయి ద్యాలు, గోవిందనామస్మరణల నడుమ వేదపండితుల మంత్రోచ్ఛార ణలతో ధ్వజారోహణ ఘట్టాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం శాసో్త్రక్తంగా నిర్వహించారు. అనంతరం 10 గంటల నుంచి 12 వరకూ శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. రాత్రి 8 గంటల నుంచి పల్లకీ ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిం చారు. బ్రహ్మోత్సవాలల్లో బాగంగా సోమవారం ఉదయం 8 గంటలకు శేష వాహన సేవ, సాయంత్రం 8 గంటలకుహంస వాహన సేవ నిర్వ హించనున్నారు. కార్యక్రమంలో శ్రీనివాస మంగాపురం టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఉప ప్రధాన అర్చకులు కృష్ణప్రసాద్ భట్టర్, ఆలయ ఇన్సపెక్టర్ రెడ్డి భాస్కర్, అర్చకులు రాఘవేంద్ర స్వామి, రమేష్ స్వామి పాల్గొన్నారు.