శ్రీకాకుళం, ఆముదాలవలస: సరుబుజ్జిలి మండలం అలికాం బత్తిలి ప్రధాన రహదారిపై గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తుండడంతో వాహనదారులు, స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలను గ్రామ సింహాలు వెంబడించడంతో అనేక రహదారి ప్రమాదాలు కూడా జరిగాయని స్థానికులు తెలిపారు. తక్షణమే వీటి నియంత్రణకు సంబంధిత అధికారులు నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa