మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నానికి మార్చి 28 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసు అందుబాటులోకి వస్తుందని ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.విజయమోహన్ సోమవారం తెలిపారు. గతంలో మలిండో పేరుతో విమాన సర్వీసులు నడిపిన సంస్థ ఇప్పుడు బాటిక్ ఎయిర్ పేరుతో వ్యవహరిస్తున్నదని వివరించారు.