విద్యార్థినుల క్లాస్ నోట్స్‌ను పరిశీలించనందుకు విశాఖపట్నం వన్‌టౌన్ క్వీన్ మేరీస్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ముగ్గురు, ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ ఇవ్వాలని డిప్యూటీ డీఈవో గౌరీశంకర్, అర్బన్ డీఐ సువర్ణను విద్యా శాఖ ప్రాంతీయ సంచాలకులు ఎం.జ్యోతికుమారి ఆదేశించారు. సోమవారం పాఠశాలను తనిఖీ చేసిన ఆమె...బోధనలో సీరియస్‌నెస్ లేదని, రోజువారీ నోట్స్‌లో తప్పులు గుర్తించి సవరించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంబంధిత టీచర్లు ఐదుగురికి షోకాజ్ ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా పాఠశాలను తరచుగా తనిఖీ చేయకపోడంపై సంబంధిత అధికారులపైనా ఆర్జేడీ ఆగ్రహం వ్యక్తంచేశారు.