మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ పూజల చెన్నకేశవులు(45) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు నగరం బ్రాడీపేటలోని సుచరిత ఇంటి సమీపంలోనే ఓ బిల్డింగ్‌లో గది అద్దెకు తీసుకుని గన్మెన్లు విశ్రాంతి తీసుకుంటుంటారు. సోమవారం రాత్రి సుచరిత సెక్యూరిటీ అధికారి రామయ్యతో కలిసి చెన్నకేశవులు విశ్రాంతి గదికి వచ్చారు. రామయ్య స్నానం చేసేందుకు తన 9 ఎంఎం పిస్టల్‌ను బయట ఉంచి బాత్రూంలోకి వెళ్లారు. దీంతో చెన్నకేశవులు ఆ తుపాకి తీసుకొని నుదిటిపై కాల్చుకుని మరణించారు. శబ్ధం విని బయటకు వచ్చిన రామయ్య వెంటనే విషయాన్ని సుచరిత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు విషయం తెలియజేశారు. ఎస్పీ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. చెన్నకేశవులు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమని భావిస్తున్నారు. అయితే ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కొందరు చెబుతున్నారు.