ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత, రామచరితమానస్, వేదాల వంటి హిందూ మత గ్రంధాలను బోధిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ఈ గ్రంధాలన్నీ చాలా అమూల్యమైనవని... మనిషిని సంపూర్ణ వ్యక్తిగా, నైతికత గల వ్యక్తిగా తీర్చిదిద్దే సామర్థ్యం ఈ గ్రంధాలకు ఉందని చెప్పారు. ఈ గ్రంధాలను బోధించాల్సిన అవసరం ఉందని ఒక ముఖ్యమంత్రిగా తాను చెపుతున్నానని అన్నారు. ఇతర సబ్జెక్టులతో పాటు హిందూ గ్రంధాలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa