రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని శ్రీకాకుళం జిల్లా, కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ కోరారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో జాతీయ రహదారి ఎక్కువ భాగం ఉందని, వాహన చోదకులు తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, కార్లలో సీటు బెల్టు పెట్టుకోవపోవడం, రహదారి నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో ఎక్కువ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వాహనచోదకులు విధిగి కంటి పరీక్షలు చేయించు కోవాలన్నారు. ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు.