స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రత్యేక హోంలోన్ ఆఫర్ ఈ నెల 31తో ముగియనుంది. దీనిలో భాగంగా హోం లోన్ వడ్డీ రేట్లపై 30 బేసిస్ పాయింట్లను తగ్గించింది. సాధారణ వడ్డీరేట్ల కంటే ఈ ఆఫర్ లో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. మంచి సిబిల్ స్కోరు ఉన్నవారికి ఈ ఆఫర్ లో 15 నుండి 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే 700 లోపు క్రెడిట్ స్కోరు ఉన్నవారికి వడ్డీ రేట్లలో ఎలాంటి తగ్గింపు ఉండదు.