భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ- మెయిల్ సర్వర్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 15 మంది ఉన్నతాధికారులకు చెందిన ఈ-మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్స్ ను హ్యాకర్స్ సేల్ కోసం పెట్టినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతేడాది ఎయిమ్స్ సర్వర్లపై సైబర్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరింది.