జాతీయ నాయకుల పోరాటాలు వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైన ఉందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లఠకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సుసంపన్న వారసత్వ సంపదయిన వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.