చికాగోలోని ఓ నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సౌత్ లేక్ పార్క్ అవెన్యూ 4800-బ్లాక్‌లోని 25 అంతస్తుల హార్పర్ స్క్వేర్ కో-ఆపరేటివ్ భవనంలోని 15వ ఫ్లోర్ లో మంటలు చెలరేగి పలు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 15వ ఫ్లోరులో నివసించే ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు 9 ఫ్లోర్లకు వ్యాపించాయి. వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa