చిలకలూరిపేట పట్టణంలో, 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, గురువారం చిలకలూరిపేట తహశీల్దారు వారి కార్యాలయంలో మండల తహశీల్దారు సుజాత పతాకావిష్కరణ చేశారు. అనంతరం తాసిల్దార్ సుజాత మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని విద్యార్థులకు వివరించారు ఎంతో మంది త్యాగ ఫలితంగా సంపూర్ణ స్వేచ్ఛ స్వతంత్రయులుగా నివసిస్తున్నాం అని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమం నందు చిలకలూరిపేట జడ్పిటిసి, డిప్యూటీ తహశీల్దారు చిలకలూరిపేట, సీనియర్ సహాయకులు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ చిలకలూరిపేట, మరియు కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.