విశాఖపట్నం, శ్రీపరదేశమ్మ అమ్మవారి కరుణ కటాక్షం ప్రజలపై ఉండాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. గురువారం ఆమె 42 వ వార్డు పరిధిలోని తాటిచెట్లపాలెం రైల్వే న్యూ కాలనీలో వెలసిన శ్రీ పరదేశమ్మ అమ్మవారి వార్షిక అనుపు మహోత్సవంలో వార్డ్ కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్ కలిసి పాల్గొని పూజలు చేశారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో అమ్మవారి అనుపు కార్యక్రమం ఊరేగింపు, కోలాటం, బల్ల వేషాలు, భారీ ఎత్తున బాణాసంచాలు , వివిధ రకాల సన్నివేశాలతో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు నగర ప్రజలపై ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు ఈ పండుగలు ఎంతో అద్దం పడతాయని, ఎంతో ఉత్సాహంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారని, ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గ్రామదేవతను పూజించే విధానం తరతరాల నుండి వస్తున్న గ్రామీణ సంప్రదాయమన్నారు. ఈకార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.