ఎలాంటి మైనింగ్ బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న, ఐదు గ్రానైట్ స్లాబుల లారీలపై శుక్రవారం గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ అధికారి కొండారెడ్డి దాడులు నిర్వహించారు. గురుజేపల్లి నుంచి గుంటూరు వైపు వెళ్తున్న రెండు లారీలను, సంతమాగులూరు మండలం నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న ఓ లారీని అదుపులోకి తీసుకొని, ఐదు లారీల్లో ఉన్న గ్రానైట్ పలకల కొలతల ఆధారంగా రూ. 11. 80 లక్షల జరిమానా విధించారు.