చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కర్నూలు వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ వరలక్ష్మీ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో రైతులకు చిరుధా న్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జేడీ వరలక్ష్మీ మాట్లాడుతూ రైతులు చిరు ధాన్యాల సాగు పట్ల అవగా హన పెంచుకోవాలన్నారు. రైతులు ఖరీఫ్‌లో కోర్ర, రబీలో పప్పుశనగ సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మహేశ్వరరెడ్డి, కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, డీఆర్సీ ఏడీఏ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ వైకేపీ ఏపీఎం శ్రీనివాసులు, శాస్త్రవేత ప్రసాద్, కల్లూరు వ్యవసాయాధికారి శ్రీనివాసరెడ్డి, సర్పంచు పద్మ, ఎంపీటీసీ మునిస్వామి పాల్గొన్నారు.