గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలోని కైలాసగిరి కొండపై ఘాటు రోడ్డు నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం తాడికొండ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ కైలాసగిరి క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తుంటారన్నారు. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అనిపించే కైలాసగిరిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని ఆరాటపడుతుంటారన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా అక్కడికి వెళ్లేందుకు భక్తులు ఆసక్తిని చూపుతుంటారన్నారు. కైలాసగిరిపై ప్రత్యక్షంగా శివపార్వతులు వున్నారని భావించే భక్తులు, ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వుంటారన్నారు. పేరేచర్ల కైలాసగిరి క్షేత్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.