ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాహేతర సంబంధంతో మహిళ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 01:29 PM

 వివాహేతర సంబంధంతో ఓ ప్రియుడు మహిళను కడతేర్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా, టి.నరసాపురం మండలం బంధంచర్ల గ్రామానికి చెందిన కంచర్ల సునీత(39) చింతలపూడి మండలం కంచెనగూడెం వద్ద అడవిలో మృతదేహం లభ్యమైంది. హత్య చేసిన ప్రియుడు పోలీసుల ఎదుట శుక్రవారం లొంగిపోయాడు. చింతలపూడి సీఐ ఎం.వి.ఎస్‌.మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. బంధంచర్ల గ్రామానికి చెందిన కంచర్ల మాణిక్యాలరావు అనే వ్యక్తితో 20 ఏళ్ల క్రితం సునీతకు వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏడాది క్రితం భర్త మృతి చెందాడు. ఆమెకు గ్రామానికి చెందిన సువర్ణరాజు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. భర్త చనిపోయిన తరువాత మళ్లీ పరిచయం పెంచుకుని ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో రూ.20 వేల నగదు ఆమెకు ఇచ్చాడు. కొద్దికాలంగా తనతో మాట్లాడడం తగ్గించిందని, ఫోన్‌ చేసినా మాట్లాడడం లేదని అసహనానికి గురై ఈనెల 20వ తేదీన కంచెనగూడెం అడవిలో కలుసుకుందామని ఫోన్‌లో మాట్లాడుకున్నారు. అడవిలోకి వచ్చిన తరువాత వీరి మధ్య మాటామాటా పెరగడంతో ఆవేశంతో ఆమె ముక్కు, గొంతు నొక్కి హత్య చేసినట్టు తెలిపాడని సీఐ తెలిపారు. మృతురాలు ఈనెల 20 నుంచి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చాట్రాయి మండలం కోటపాడు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. చింతలపూడి మండలంలో శవమై కనిపించిన నేపథ్యంలో చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మహిళ మృతికి విహేతర సంబంధమే కారణం కావచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతితో కోటపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com