శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయంలో భక్తులు ఆందోళనకు దిగారు. నేడు రథసప్తమి సందర్భంగా అరసవల్లి భాస్కరుని నిజరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దీంతో దర్శనానికి గంటల కొద్ది సమయం పడుతోంది. అయితే దేవాదాయ శాఖ అధికారులు వీఐపీల సేవలో తరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక దర్శనం కోసం రూ.500 టికెట్ తీసుకున్న భక్తులను సైతం గంటలకొద్ది క్యూలైన్లో నిలిపివేయడంతో ఈఓపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.