ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వపక్షానికి ఒక చట్టం, విపక్షాలకు మరో చట్టం ఉంటుందా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 08:20 PM

‘‘వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డిని న్యాయవాది సమక్షంలో సీబీఐ విచారణ చేయాలని, దాన్ని వీడియో చిత్రీకరించాలని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరటం హాస్యాస్పదంగా ఉంది’’ అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఎద్దేవా చేశారు.  ‘‘మూడున్నరేళ్ల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, కస్టోడియల్‌ టార్చర్‌ చేసినప్పుడు వైసీపీ నేతలకు ఈ విషయం గుర్తుకు రాలేదా? స్వపక్షానికి ఒక చట్టం, విపక్షాలకు మరో చట్టం ఉంటుందా? ఏపీ పోలీసులకు ఒక రూలు.. సీబీఐకి మరో రూలా? రాష్ట్రంలో వైసీపీ పాలన, వైసీపీ నేతల వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని పయ్యావుల పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com