లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు బెజవాడలో మరొకరు బలయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం, సూరాయపాలెంలో తంగెళ్ళముడి రాజేష్ అనే వ్యక్తి నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. యాప్ నిర్వాహకులు రాజేష్ ఫొటోను నగ్నంగా ఉన్న మహిళ ఫొటో పక్కన మార్ఫింగ్ చేసి.. ఆ ఫొటోను రాజేష్ భార్యకు పంపి బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన రాజేష్.. తనను లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారని భార్యకు ఫోన్లో చెప్పి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రాజేష్ భార్య ఇంటికి వచ్చేలోగా ఫ్యాన్‌కి వేలాడుతూ భర్త కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa