మోటారు సైకిళ్ల దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 9 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణ సీఐ ముత్యాల సత్యనారాయణ చెప్పారు. తణుకు పరిసర ప్రాంతాల్లో 8, రాజో లులో 1 దొంగలించాడన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన కర్రి సోమేశ్వరరావును శనివారం సజ్జాపురం అండర్ పాస్ బ్రిడ్జి వద్ద అరెస్టు చేసి 9 మోటారు సైకిళ్ళు స్వాధీనం చేసుకొన్నామన్నారు. వాటి విలువ 6 లక్షల 30 వేలు ఉం టుందన్నారు. పట్టణ ఎస్‌ఐ విశ్రీనివాసరావు, ఏఎస్‌ఐ పోలయ్యకాపు, హెచ్‌సీ సత్యనారాయణ, వెలగేశ్వరావు, రవి,గోవిందరావులను జిల్లా ఎస్పీ రవిప్రకాష్, డీఎస్పీ రవిమనోహరచారి అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa