ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 08:35 PM

 సీపీఎస్‌ను, గ్యారెంటీ లేని జీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ త్వరలో విజయవాడ, గుంటూరు, ఏలూరులలో రాష్ట్రస్థాయి ఉద్యమ సదస్సులను నిర్వహించనున్నట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి వెల్లడించారు. ఏలూరులోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన డివిజన్‌ సీపీఎస్‌ సదస్సులో ఎమ్మెల్సీ మాట్లాడారు. రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వాలు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయగా, హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు అమలుకు ప్రయత్నాలు చేస్తున్నాయని వివరించారు. ఓపీఎస్‌ అమలుకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు. నాయకులు రవికుమార్‌, నరసింహారావు, సుభాషిణి, కనకదుర్గ, రాంబాబు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa