ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి జాబితాలో పడిపోయిన జగన్ గ్రాఫ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 08:54 PM

 ముఖ్యమంత్రి జగన్‌ గ్రాఫ్‌ భారీగా పడిపోయిందనే చెప్పుకోవచ్చు. ‘సంక్షేమంలో, అభివృద్ధిలో, పారదర్శక పాలనలో మేమే టాప్‌’ అని ప్రభుత్వం చెబుతుండగా... అంత సీన్‌ లేదని రాష్ట్ర ప్రజలు తేల్చేసినట్లు ‘సీ ఓటర్‌ - ఇండియా టుడే’ సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులకు వారి సొంత రాష్ట్రాల్లో ఉన్న ప్రజాదరణపై ఈ సర్వే జరిగింది. 2022 జనవరిలో జరిగిన సర్వేలో జగన్‌ పనితీరుపై 56.5శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో అది 17 శాతం తగ్గి... 39.7శాతానికి పడిపోయింది. ఈ జాబితాలో 73.2శాతం ఓట్లతో ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఇక... ‘ఎవరు బెస్ట్‌ సీఎం’ అని ప్రశ్నించినప్పుడు గతేడాది జగన్‌కు 3.9శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 1.6శాతానికి పడిపోయాయి. ఈ జాబితాలో 39.1శాతం ఓట్లతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అగ్రస్థానంలో ఉన్నారు. ఇక... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏ జాబితాలోనూ చోటు దక్కలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa