రోడ్డుప్రమాదంలో ఇంటి పెద్దని కోల్పోయారు. కుటుంబసభ్యుడి మృతితో తెలుగుదేశం పార్టీ ఆ ఇంటిపెద్ద బాధ్యత తీసుకుంది. టిడిపి సభ్యత్వం తీసుకోవడం ద్వారా కల్పించిన భీమా పాలసీతో ఆ కుటుంబానికి ధీమా దొరికింది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం, దండికుప్పం గ్రామంలో వ్యవసాయం చేస్తూ కె.ఎస్ సుబ్రహ్మణ్యం తన భార్య మంజుల, కుమారుడు హరీష్‌బాబు, కుమార్తె ఐశ్వర్యలను పోషించేవారు. 2018 సంక్రాంతి పండుగ అందరూ సంతోషాలతో జరుపుకుంటే, సుబ్రహ్మణ్యం కుటుంబానికి విషాదం మిగిల్చింది. లారీ ఢీ కొనడంతో సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడి మృత్యువాతపడ్డాడు. చిన్నపిల్లలతో జీవనాన్ని ఎలా ముందుకు సాగించాలో తెలియని మంజుల తీవ్ర ఆందోళనకి గురయ్యారు. అప్పుడు టిడిపి ప్రమాదభీమా కింద రూ.2లక్షలు సాయం అందజేసింది. ఈ డబ్బుతో పిల్లలకు సొంత గూడు కల్పించాలనే ఆలోచనతో చిన్న ఇల్లు కట్టుకున్నారు. తెలుగుదేశం వల్లే తమ కుటుంబానికి ఓ నీడ దొరికిందని పాదయాత్రలో లోకేష్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు సుబ్రహ్మణ్యం, మంజుల కుమారుడు హరీష్ బాబు.