మాఘమాసం నవమి సోమవారం సందర్భముగా రాజాము నియోజకవర్గంలోని పలు శివాలయాలలో ప్రాత కాలం నుంచి స్వామివారికి విశేషమైన పూజలు జరిగాయి. ఆయా దేవాలయాల అర్చకులు స్వామివారికి నమక చమకాలతో రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. పరమేశ్వరునికి వివిధ రకాల పుష్పాలతో గన్నేరు, మందార, మారేడు పుష్పాలతో విశేష పూజలను చేశారు. అనంతరం భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.