భారతదేశం సమగ్రతతో, సమైక్యతతో ఉన్న తరుణంలో భారతదేశ రాజకీయాల్లోకి ఆర్ఎస్ఎస్ విధానాలతో వచ్చిన భాజాపా జాతుల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తు రాజకీయ కుతంత్రాలు పన్నుతుందని, వాటిని తిప్పికొట్టేందుకు భారతదేశ ప్రజలను సమైక్యంగా ఉంచేందుకు గౌరవ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జూడో యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో భారత్ జూడో యాత్రకు సంఘీభావంగా డిసిసి అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి జాతీయ జెండాను ఎగురవేసి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ మహాత్ముడు చూపించిన శాంతియుత మార్గంలో తమ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర దిగ్విజయంగా ముగించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని దేశ సమగ్రతను సమైక్యతను దేశ ప్రజలు కాపాడుకొని దేశాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా కోరారు. ఏఐసిసి, పిసిసి ఆదేశాలు ఆమె మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సనపల అన్నాజీరావు, దేశేళ్ల గోవింద మల్లిబాబు, పైడి నాగభూషణ రావు, లఖినేన నారాయణరావు, కొత్తకోట సింహాద్రి నాయుడు, బస్వా షణ్ముఖరావు, రెల్ల సురేష్, తెంబూరు మధుసూదన్ రావు, దన్నాన భోగి నాయుడు, డాక్టర్ కవిటి గోపాలకృష్ణ, కొత్తకోట లక్ష్మి , అంబటి దాలినాయుడు, శ్యాంసుందర్ మొదలగు వారు పాల్గొన్నారు.