సచివాలయంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ చెప్పారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి పోస్టర్, పాంప్లేట్ లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు వ్యయ ప్రయాసాలతో జిల్లా కేంద్రాలకు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తిరగకుండా మీ గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప కలెక్టర్ జి. జయదేవి, జడ్పీ సీఈవో వెంకటరామన్, పిడిలు విద్యాసాగర్, చిట్టిరాజు, జిల్లా రిజిస్ట్రార్, తదితరులు పాల్గొన్నారు.