చిలకలూరిపేట, పట్టణంలోని 23వ వార్డులో ఉన్న సుబ్బయ్యతోట ప్రాంతంలో ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విస్తృతం గా పర్యటించారు. ఆమె వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి లబ్ధిదారులను కలుస్తూ సంక్షేమ పథకాల వివరాలు ఉన్న కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగారు. ఆమె మాట్లాడుతూ.... రాష్ట్రంలో పెద్ద ఎత్తున జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నిరు పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని అన్నారు. ఈ పథకాలను లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని, జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. వైసీపీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ముఠా మేస్త్రి, హనుమంతరావు, వారి అనుచరులు వైసీపీలో చేరారు. వారికి మంత్రి రజిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ షేక్ రఫానీ, యార్డు చైర్మన్ తోట రాజేంద్ర ప్రసాదు, వైసీపీ నాయకులు తోట బ్రహ్మ స్వాములు, కందుల శ్రీకాంత్, బేరింగ్ మౌలాలి, పఠాన్ తలహాఖాన్ పాల్గొన్నారు.