‘భారతీ పే’ యాప్ పోస్టు వ్యవహారంలో విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గుంటూరు సీఐడీ కార్యాలయానికి విజయ్ చేరుకున్నారు. గతేడాది సెప్టెంబరులో విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో విజయ్‌కు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అదే రోజున వేరే కార్యక్రమాలు ఉండటంతో సీఐడీ విచారణకు హాజరుకాలేనని హైకోర్టులో చింతకాయల విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నేడు సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. లాయర్ సమక్షంలో విచారణ జరపాలని కోర్టు సూచించింది. దీంతో సీఐడీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.