ఇవాళ సాయంత్రంలోపు తారకరత్న హెల్త్ బులెటిన్‌ను ఆస్పత్రి వర్గాలు విడుదల చేయనున్నాయి. రిపోర్టు ఎలా వస్తుందనే దానిపై నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు వైద్యులు గుర్తించినట్లు ఇదివరకే చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు న్యూరో సర్జన్లు సహా 10మంది వైద్యులు తారకరత్న ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు.. ఆస్పత్రి వద్ద సందర్శకుల తాకిడి పెరగడంతో బెంగళూరు పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.