స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సభ్యురాలిగా ఏపీ క్రీడా మంత్రి రోజా నియమితులయ్యారు. రోజాతో పాటు మరో నాలుగు రాష్ట్రాల క్రీడామంత్రులకు కూడా సాయ్ సభ్యులుగా అవకాశం లభించింది. సాయి లో రోజా సౌత్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మేరకు కార్యదర్శి జతిన్ నర్వాల్ తెలిపారు. మంత్రి రోజా అరుదైన అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. మెరుగైన రీతిలో సేవలు అందిస్తామన్నారు.