నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి తాజా బులెటిన్‌ను విడుదల చేసింది.తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. తారకరత్న ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని తెలిపారు.ఇప్పటి వరకు తారకరత్నకు ఎక్మో సపోర్ట్ చేయలేదని వివరించారు.తారకరత్న కుటుంబసభ్యులు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తున్నారని, తారకరత్న ఆరోగ్యం బాగుంటే తప్పకుండా షేర్ చేస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.