టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా సెమీ ఫైనల్ ప్రయాణం సంక్లిష్టంగా మారింది. సూపర్ 8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలవ్వడంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే రెండు మ్యాచ్‌లు భారత్ భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు దక్షిణాఫ్రికా-వెస్టిండీస్, చెన్నై వేదికగా రాత్రి 7 గంటలకు భారత్-జింబాబ్వే తలపడనున్నాయి. ప్రస్తుత సమీకరణాల ప్రకారం టీమిండియా సెమీస్ చేరాలంటే పలు అవకాశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జట్టు చేతిలో ఉండగా, మరికొన్ని ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa