దేశవ్యాప్తంగా ట్రయల్‌కోర్టులు 2022లో 165 మందికి మరణశిక్షలు విధించాయి. దీంతో గతేడాది చివరినాటికి మరణశిక్షను ఎదుర్కొంటున్న మొత్తం ఖైదీల సంఖ్య 539కి చేరింది. 2000 తర్వాత ఒక్క ఏడాదిలో ఇంతమందికి మరణశిక్షలు విధించడం ఇదే తొలిసారి. ‘డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా' రిపోర్టు ప్రకారం గతేడాది గుజరాత్‌లో అత్యధికంగా 51 మందికి మరణశిక్షలు పడ్డాయి. ఉరిశిక్షపడ్డ 539 మంది ఖైదీల్లో అత్యధికులు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నారు.